27, మార్చి 2010, శనివారం
రామ చక్కని సీతకి
నీల గగన ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మదుర వదన నలిన నయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి
ఉడత వీపున వేలువిడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే.... మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి
ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా ప్రేమా?
సినిమా :గోదావరి
సాహిత్యం : వేటూరి
సంగీతం :రాధాకృష్ణన్
దర్శకత్వం :శేఖర్ కమ్ముల
గానం : గాయత్రి
ఈ పాటను ఇక్కడ వినవచ్చు , ఇక్కడ చూడొచ్చు .
అనగనగా ఒక రోజు
మా ఊరు ,అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కపక్కనే( పావుగంట నడక) ఉండటం వల్ల ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం.అది నేను బడి లో చేరిన మొదటి సంవత్సరం. సంక్రాంతి సెలవలకి ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం.బడి తెరిచేరోజు కి అమ్మ మనం ఈ రోజు ఊరికెళ్లడం లేదు రేపు వెళ్దాము అని చెప్పింది ,నాకేమో బడి మానేయడం ఇష్టం లేదు . అప్పుడేం చేయాలా అని ఆలోచించి చెప్పా పెట్టకుండా పొద్దునే పొలం పనులకి వెళ్ళే వాళ్ళ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాను. దారి మద్య లో నాకు తెలిసినతను అడిగితే మా ఊరు వెళ్తున్నానని చెప్పాను(ఒక్కదాన్ని అలా వెళ్తుంటే ఆయన కనీసంనన్ను ఆపలేదు ఎందుకో ).మా ఊరు వెళ్తుంటే దారి లో మా కొష్టం వస్తుంది (అక్కడ మా గేదెలు కట్టేస్తాం)అక్కడికి అప్పుడే మానాయనమ్మ పాలు పిండటానికి వచ్చింది .మా ఇంట్లో రాఘవమ్మ అని మా తాతయ్య వాళ్ళ మేనత్త ఉండేది. ఆమెకి నేనంటే చాలా ఇష్టం (ఆమె గురించి ఇంకో టపా లో చెప్తాను)ఆమె కూడా అక్కడే ఉంది అంత పొద్దునే నేనొక్కదాన్నే రావడం చూసి చాలా కంగారు పడ్డారు తరువాత నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళారు.నేను ఇక్కడికి వచ్చానని చెప్పటానికి ఇప్పటిలాగా ఫోన్ లు లేవు ఎవరో ఒకరు వెళ్లి చెప్పాలి నాయనమ్మ ఎవరినైనా పంపిద్దామని అలాబజారు లో కి వెళ్ళింది .
అక్కడేమో అమ్మమ్మ,అమ్మ నేను ఎంతసేపటికి కనిపించకపోయేసరికి ఎక్కడ ఆడుకుంటూ ఉన్నానా అని వెతకటం మొదలు పెట్టారు .అప్పటికి చెల్లి చిన్నది కావడం తో అమ్మ ఇంటిదగ్గరే ఉంది . అమ్మమ్మ మాత్రం కనిపించిన వాళ్ళని అడుగుతూ ,పొలాలలో ఎక్కడన్నా ఉన్నానేమో అని చూస్తూ వెతుకుతూ ఉంటే నాకు ఎదురొచ్చిన అతను నేను మా ఊరు వెళ్లనని చెప్పాడంట. అమ్మమ్మ మా ఊరు వచ్చి ఇంట్లోకి వస్తూనే రాగమ్మ తాతమ్మ ని అమ్మాయి ఏమైనా వచ్చిందా అని అడిగిందట ఆమేమో కోపం తో రాలేదు అని చెప్పిందట .అప్పుడు అమ్మమ్మ నిజం చెప్పమ్మా అని అడిగేసరికి ఇంట్లో ఉంది వెళ్ళు అని చెప్పిందట.ఇంటికొచ్చి నన్ను చూసేవరకు అమ్మమ్మ ఎంత భయపడి ఉంటుందో ఊహించడానికే నాకు ధైర్యం చాలడంలేదు .

11, ఫిబ్రవరి 2010, గురువారం
లింగాష్టకం
'ఓం' ఎంత మధురమైన శబ్దం. ఎంత అలసిపోయిన వారికైనా అద్వితీయ శక్తి నిచ్చే అద్భుత మంత్రం .
ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఓంకారం వినబడగానే మనసు, శరీరం భక్తి భావం తో పులకించి పోతాయి .
ఆ అనుభూతిని వర్ణించడానికి ఎన్ని మాటలు సరిపోవు .
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.
హర హర శంభో మహాదేవ...ఓం నమశ్శివాయ .
మహాశివరాత్రి సందర్భంగా నాకు ఎంతో ఇష్టమైన లింగాష్టకం నా బ్లాగ్ లో .
అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ చల్లనితండ్రి దీవెనల తో అందరు హాయిగా ఉండాలని కోరుకుంటూ .........

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)