మా ఊరు ,అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కపక్కనే( పావుగంట నడక) ఉండటం వల్ల ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం.అది నేను బడి లో చేరిన మొదటి సంవత్సరం. సంక్రాంతి సెలవలకి ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం.బడి తెరిచేరోజు కి అమ్మ మనం ఈ రోజు ఊరికెళ్లడం లేదు రేపు వెళ్దాము అని చెప్పింది ,నాకేమో బడి మానేయడం ఇష్టం లేదు . అప్పుడేం చేయాలా అని ఆలోచించి చెప్పా పెట్టకుండా పొద్దునే పొలం పనులకి వెళ్ళే వాళ్ళ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాను. దారి మద్య లో నాకు తెలిసినతను అడిగితే మా ఊరు వెళ్తున్నానని చెప్పాను(ఒక్కదాన్ని అలా వెళ్తుంటే ఆయన కనీసంనన్ను ఆపలేదు ఎందుకో ).మా ఊరు వెళ్తుంటే దారి లో మా కొష్టం వస్తుంది (అక్కడ మా గేదెలు కట్టేస్తాం)అక్కడికి అప్పుడే మానాయనమ్మ పాలు పిండటానికి వచ్చింది .మా ఇంట్లో రాఘవమ్మ అని మా తాతయ్య వాళ్ళ మేనత్త ఉండేది. ఆమెకి నేనంటే చాలా ఇష్టం (ఆమె గురించి ఇంకో టపా లో చెప్తాను)ఆమె కూడా అక్కడే ఉంది అంత పొద్దునే నేనొక్కదాన్నే రావడం చూసి చాలా కంగారు పడ్డారు తరువాత నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళారు.నేను ఇక్కడికి వచ్చానని చెప్పటానికి ఇప్పటిలాగా ఫోన్ లు లేవు ఎవరో ఒకరు వెళ్లి చెప్పాలి నాయనమ్మ ఎవరినైనా పంపిద్దామని అలాబజారు లో కి వెళ్ళింది .
అక్కడేమో అమ్మమ్మ,అమ్మ నేను ఎంతసేపటికి కనిపించకపోయేసరికి ఎక్కడ ఆడుకుంటూ ఉన్నానా అని వెతకటం మొదలు పెట్టారు .అప్పటికి చెల్లి చిన్నది కావడం తో అమ్మ ఇంటిదగ్గరే ఉంది . అమ్మమ్మ మాత్రం కనిపించిన వాళ్ళని అడుగుతూ ,పొలాలలో ఎక్కడన్నా ఉన్నానేమో అని చూస్తూ వెతుకుతూ ఉంటే నాకు ఎదురొచ్చిన అతను నేను మా ఊరు వెళ్లనని చెప్పాడంట. అమ్మమ్మ మా ఊరు వచ్చి ఇంట్లోకి వస్తూనే రాగమ్మ తాతమ్మ ని అమ్మాయి ఏమైనా వచ్చిందా అని అడిగిందట ఆమేమో కోపం తో రాలేదు అని చెప్పిందట .అప్పుడు అమ్మమ్మ నిజం చెప్పమ్మా అని అడిగేసరికి ఇంట్లో ఉంది వెళ్ళు అని చెప్పిందట.ఇంటికొచ్చి నన్ను చూసేవరకు అమ్మమ్మ ఎంత భయపడి ఉంటుందో ఊహించడానికే నాకు ధైర్యం చాలడంలేదు .
27, మార్చి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిన్నప్పుడే సాహసాలా! మీరు చాలా గ్రేటండి.
రిప్లయితొలగించండిsahasame cheyra dimbaka..baga chepparu[:)]
రిప్లయితొలగించండిస్వరాంజన్ గారు,గంగాధర్ గారు ధన్యవాదాలండి .
రిప్లయితొలగించండిబాగుందండీ మీ సాహసం..
రిప్లయితొలగించండిమురళి గారు మీకు చాల చాల థాంక్స్ అండి.మీరు వీలు చూసుకొని మరి నా చిన్ని బ్లాగ్ ని చూడటం,నా ప్రతి టపాకి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపడం నాకెంతో సంతోషంగా ఉంది.నెమలికన్ను ఈనాడు లో వచ్చినప్పటి నుండి ప్రతి టపాని చదువుతూనే ఉంటాను కానీ నా అబిప్రాయాన్ని తెలుపడానికి మాత్రం మాటలు రావడం లేదండి.
రిప్లయితొలగించండిమరొక్కసారి ధన్యవాదములు.
అబ్బే, మరీ అంత చిన్న వయసులో బడి అంటే ఇంతిష్టం ఉండడం అస్సలు బాలేదు :)
రిప్లయితొలగించండినేను కొత్తపాళీ గారితో ఏకీభవిస్తున్నాను. ఆ వయసులో బడి ఎలా మానేయాలో ఆలోచించాలిగాని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడమేమిటి..అబ్బే ఇదేంబాగాలేదు. నేనొప్పుకోను.
రిప్లయితొలగించండిశ్రీవాసుకి
కొత్తపాళీ గారు, వాసుకి గారు, ఏంటో నండి చిన్నప్పటి నుండి బడి మానేయడం అసలు ఇష్టం ఉండదు,ఏదో మిస్ అయ్యానని అనిపిస్తుంది.ఆరోజు క్లాసులో ఏమిజరిగిందో ఎంతమంది చెప్పిన నాకు ఏదో వెలితి గానే అనిపిస్తుంది,అలా అని క్లాసు ఫస్ట్ ఏమి రాను కానీ నా వరకు నేను బానే చదువుతాను.
రిప్లయితొలగించండిమీ కామెంట్ కి ధన్యవాదములు .