27, మార్చి 2010, శనివారం

రామ చక్కని సీతకి


నీల గగన ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మదుర వదన నలిన నయనా మనవి వినరా రామా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలువిడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే.... మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా ప్రేమా?

సినిమా :గోదావరి
సాహిత్యం : వేటూరి
సంగీతం :రాధాకృష్ణన్
దర్శకత్వం :శేఖర్ కమ్ముల
గానం : గాయత్రి

ఈ పాటను ఇక్కడ వినవచ్చు , ఇక్కడ చూడొచ్చు .

5 కామెంట్‌లు:

  1. "ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
    ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో"..నాకు చాలా ఇష్టమైన లైన్స్ అండీ ఇవి.. నిజానికి వీటిని వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారు.. చాలా మంచి పాట.. ట్యూను, గొంతు, సాహిత్యం, సన్నివేశం ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి..

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు నాకు కూడా ఈ లైన్ బాగా ఇష్టమండి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. స్రవంతి గారు మీ బ్లాగు పేరుకు తగ్గట్టే చక్కగా వుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నాకు చాలా ఇష్టమండి ఈ పాట,same to same అవే lines నాకు ఇష్టం, నేను కూడా మీ లాగే బ్లాగు లొకం లోకి వచ్చాను, నెమలికన్ను ద్వారా, ఇంక అప్పటినుండి అనుకుంటూనే ఉన్నాను నేను మొదలుపెట్టాలి ఒక బ్లాగు ని అని కాని మురళి గారు అన్నట్టు బద్దకం ఎక్కువ.

    అంతేకాదు ఇంతమంది హేమాహేమీల నడుమ నా బ్లాగు అసలు అవసరమా అని...

    రిప్లయితొలగించండి
  5. అమర్ గారు ధన్యవాదములండి .
    కవిత గారు, మీరు కూడా నెమలికన్ను ద్వారానే బ్లాగ్ లోకం లోకి వచ్చారనమాట,నేను కూడా ఈ మద్య బద్ధకం తగ్గించి బ్లాగ్ మొదలు పెట్టానండి ,మీరు కూడా అందరికోసం ఆలోచించకుండా మీ కోసం వ్రాయండి,పెద్దవాళ్ళతో పోల్చుకుంటే ఎలా అండి ,మనకి వచ్చినవి,నచ్చినవి మనం కూడా పంచుకుందాం. ఏమంటారు? మీ బ్లాగ్ కోసం చూస్తూ ఉంటానండి. నా బ్లాగు కి విచ్చేసినందుకు ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి