11, ఫిబ్రవరి 2010, గురువారం

లింగాష్టకం

'ఓం' ఎంత మధురమైన శబ్దం. ఎంత అలసిపోయిన వారికైనా అద్వితీయ శక్తి నిచ్చే అద్భుత మంత్రం .
ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఓంకారం వినబడగానే మనసు, శరీరం భక్తి భావం తో పులకించి పోతాయి .
ఆ అనుభూతిని వర్ణించడానికి ఎన్ని మాటలు సరిపోవు .

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.

హర హర శంభో మహాదేవ...ఓం నమశ్శివాయ .

మహాశివరాత్రి సందర్భంగా నాకు ఎంతో ఇష్టమైన లింగాష్టకం నా బ్లాగ్ లో .
అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ చల్లనితండ్రి దీవెనల తో అందరు హాయిగా ఉండాలని కోరుకుంటూ .........

8, ఫిబ్రవరి 2010, సోమవారం

పాదమెటు పోతున్న ... పయనమెందాకైనా

ఏదో ఆవేశంగా బ్లాగ్ అయితే మొదలుపెట్టాను కానీ ఏం రాయాలో అర్ధం కావడం లేదు. మొత్తానికి ఒక మంచి పాటతో మీ ముందుకొచ్చాను. నేను చెప్పబోయే ఈ పాట శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన "హ్యాపీ డేస్ " సినిమా లోది .

స్నేహం గురించి చెప్పటానికి మన తెలుగు సినిమాలో చాలా పాటలే ఉన్నాయి, అందులో ఈ పాట నాకు బాగా నచ్చింది. మిక్కీ జే మెయెర్ సంగీత దర్శకత్వం లో కార్తీక్ పాడిన ఈ పాటకు వనమాలి సాహిత్యాన్ని అందించారు.





ఈ పాటని మీరు వినాలను కుంటే ఇక్కడ ,

చూడాలను కుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకసారి సాహిత్యం చూస్తే మీకు కూడా నచ్చుతుంది.



మై ఫ్రెండ్ ....

పాదమెటు పోతున్న ... పయనమెందాకైనా
అడుగు తడబడుతున్న... తోడురానా
చిన్ని ఎడబాటైన .. కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా.

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం .. నేస్తమల్లే అల్లుకుంది
జన్మ కంతా తీరిపోని .. మమతలెన్నో పంచుకుంది
మీరు మీరు నుంచి మన స్నేహగీతం.. ఏరా ఏరా ల్లోకి మారే
మొహమాటాలేలేని కల జాలువారే .

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చింతలన్ని చెంతవాలే
గిల్లి కజ్జలెన్నో ఇలా పంచుకుంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

బ్లాగ్ తో నా పరిచయం.


అందరికీ వందనములు.
నాకు ఈనాడు చదివే అలవాటు ఉండటం వలన మొదటిసారి మనసులోమాట తరువాత నెమలికన్ను పరిచయము అయ్యాయి. ఈ రెండు బ్లాగుల ద్వారానే మిగతా బ్లాగ్ ప్రపంచాన్ని చూసాను.ఎప్పటి నుండో నేను కూడా నా ఆలోచనలని బ్లాగు ద్వారా పంచుకోవాలని అనుకొని ఇప్పటికి మొదలుపెట్టాను .