8, ఫిబ్రవరి 2010, సోమవారం

పాదమెటు పోతున్న ... పయనమెందాకైనా

ఏదో ఆవేశంగా బ్లాగ్ అయితే మొదలుపెట్టాను కానీ ఏం రాయాలో అర్ధం కావడం లేదు. మొత్తానికి ఒక మంచి పాటతో మీ ముందుకొచ్చాను. నేను చెప్పబోయే ఈ పాట శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన "హ్యాపీ డేస్ " సినిమా లోది .

స్నేహం గురించి చెప్పటానికి మన తెలుగు సినిమాలో చాలా పాటలే ఉన్నాయి, అందులో ఈ పాట నాకు బాగా నచ్చింది. మిక్కీ జే మెయెర్ సంగీత దర్శకత్వం లో కార్తీక్ పాడిన ఈ పాటకు వనమాలి సాహిత్యాన్ని అందించారు.





ఈ పాటని మీరు వినాలను కుంటే ఇక్కడ ,

చూడాలను కుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకసారి సాహిత్యం చూస్తే మీకు కూడా నచ్చుతుంది.



మై ఫ్రెండ్ ....

పాదమెటు పోతున్న ... పయనమెందాకైనా
అడుగు తడబడుతున్న... తోడురానా
చిన్ని ఎడబాటైన .. కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా.

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం .. నేస్తమల్లే అల్లుకుంది
జన్మ కంతా తీరిపోని .. మమతలెన్నో పంచుకుంది
మీరు మీరు నుంచి మన స్నేహగీతం.. ఏరా ఏరా ల్లోకి మారే
మొహమాటాలేలేని కల జాలువారే .

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చింతలన్ని చెంతవాలే
గిల్లి కజ్జలెన్నో ఇలా పంచుకుంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే

ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
.. మై ఫ్రెండ్ .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
.. మై ఫ్రెండ్ .. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.

6 కామెంట్‌లు:

  1. hi....nice song ...nenu kooda meelage anukunnanu...kani maa akkayya punyamaani...naa blog ni mundduku tisikelthunnanu...don't worry ...keep posting..nice blog....wish u all the best.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది . మంచి పాటను వినిపించారు , చూపించారు . వెల్కం .

    రిప్లయితొలగించండి
  3. అశోక్ గారు,మాలా కుమార్ గారు చాలా థాంక్స్ అండి

    రిప్లయితొలగించండి
  4. నాక్కూడా ఇష్టమైన పాట.. ఇప్పటి వాళ్ళలో కార్తిక్ గొంతు ప్రత్యేకంగా ఉంటుందండీ..

    రిప్లయితొలగించండి
  5. sravanthi garu meeru post chesina konni topics aina chala perfect ga present chesthunnaru

    nijanga andi.. chala websites lo mistakes vuntai song lyrics lo.. kani miru vrasina songs lo nenu vaati choodaledhu..

    Godavari lo rama chakkani seethaki song lyrics raasi cross check chesukundam ani oka 7 blogs open chesanu. andhulo meedhi okati.. meedhi thappa anni blogs lo thappulu vunnai..

    gud work.. keep it up..

    nenu mila post chesthuntanu lyrics ni ikkada.. ( ezeelyrics.com)

    రిప్లయితొలగించండి